: బాబుతో కలిసి ఢిల్లీకి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. పవన్ కల్యాణ్ తో సమావేశం పూర్తైన అనంతరం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, పవన్ తో కలిసి ఢిల్లీ వెళ్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెల్ లో ఏపీకి ఎలాంటి ప్రత్యేకతలూ కల్పించకపోవడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రైల్వే బడ్జెట్ లో ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు కల్పించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్, బడ్జెట్ లో కేంద్రం ఏపీని కరుణిస్తుందని భావిస్తున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించారు. బడ్జెలో ఏపీకి ఎలాంటి రాయితీలు, నిధుల కేటాయింపు దక్కని నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్టు ప్రకటించారు.