: ప్యాసింజర్ రైల్లో చోరీ... మత్తు మందు కలిపిన టీ ఇచ్చి ప్రయాణికుడి నిలువు దోపిడీ
విశాఖపట్నం-రాయపూర్ ప్యాసింజర్ రైల్లో కొద్దిసేపటి క్రితం భారీ చోరీ జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి మత్తు మందు కలిపిన టీ ఇచ్చిన దుండగులు అతడిని నిలువునా దోచుకున్నారు. వారిచ్చిన టీ తాగగానే బాధితుడు స్పృహ కోల్పోయాడు. అనంతరం దుండగులు అతడికి చెందిన ల్యాప్ టాప్ తో పాటు బంగారం, నగదును దోచుకున్నారు. మత్తు మందు మోతాదు ఎక్కువగా ఉండటంతో బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.