: దళితుడినైనందుకే గద్దె దించారు... కొత్త పార్టీని ప్రకటించిన బీహార్ మాజీ సీఎం
దళితుడినైనందుకే తనను గద్దె దించారని బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ ఆవేదన వ్యక్తం చేశారు. తనను అవమానకర రీతిలో పదవి నుంచి తప్పించిన బీహార్ సీఎం, జేడీయూ వృద్ధ నేత నితీశ్ కుమార్ పై పోరు సాగిస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీశ్ పై పోరు కోసం హిందూస్థాన్ అవామ్ మోర్చా (హామ్) పేరిట కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు మాంఝీ ప్రకటించారు. బీహార్ లో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని, అందుకు తనకు జరిగిన అవమానమే నిదర్శనమన్నారు. తాను పదవి నుంచి దిగిపోయిన తర్వాత సీఎం అధికార నివాసాన్ని నితీశ్ కుమార్ గంగాజలంతో కడిగించారంటూ మాంఝీ ఆరోపించారు.