: బడ్జెట్ లో కేంద్రం ఏపీకి అన్యాయం చేసింది... త్వరలో ప్రధాని మోదీని కలుస్తా: పవన్ కల్యాణ్


కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నేటి ఉదయం హైదరాబాదులో ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ లో రాష్ట్రానికి కేంద్రం కేటాయింపులు లేకపోవడం తనను నిరాశకు గురి చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై త్వరలో ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానని చెప్పిన పవన్, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చిస్తానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News