: ఏపీ ఎంసెట్ తేదీల్లో మార్పు... కే సెట్ నేపథ్యంలోనే పునరాలోచన అంటున్న మంత్రి గంటా


ఏపీ ఎంసెట్ షెడ్యూల్ లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. మే 14న నిర్వహించనున్న ఎంసెట్ కు సంబంధించిన షెడ్యూల్ ను ఇటీవలే ఏపీ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణలు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహణపై సుదీర్ఘంగా కొనసాగిన వివాదంతో ఎట్టకేలకు వేర్వేరుగానే పరీక్ష నిర్వహించుకోవాలని తీర్మానించిన ఏపీ ప్రభుత్వం ఆ మేరకు షెడ్యూల్ ను ఖరారు చేసింది. అయితే ఎంసెట్ పరీక్ష జరిగే రోజుననే కే సెట్ పరీక్ష ఉన్న నేపథ్యంలో ఎంసెట్ పరీక్ష తేదీలను మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కోరారు. ఈ నేపథ్యంలో పరీక్ష తేదీల మార్పును పరిశీలిస్తున్నామని ప్రకటించిన గంటా, త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని కొద్దిసేపటి క్రితం వెల్లడించారు.

  • Loading...

More Telugu News