: మార్పు కోసమే ప్రజలు మాకు అధికారమిచ్చారు... కఠిన నిర్ణయాలతోనే మార్పు: వెంకయ్యనాయుడు


దేశంలో మార్పు కోసమే ప్రజలు తమకు అధికారమిచ్చారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజలు కోరుకున్న మార్పు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర రైల్వే, సాధారణ బడ్జెట్ల అనంతరం హైదరాబాదు వచ్చిన ఆయన ఇక్కడి బీజేపీ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊకదంపుడు ఉపన్యాసాలతో, సాధ్యం కాని హామీలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదన్నారు. అంతేకాక బడ్జెట్ పై విపక్షాలు చేసిన ఆరోపణలకు ప్రధాని నరేంద్ర మోదీ సరైన సమాధానాలిచ్చారన్నారు. పార్లమెంటులో ప్రధాని ప్రసంగానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News