: ఇకపై నేతాశ్రీల మీదకు నాణ్యమైన చెప్పులు విసరొచ్చు... జైట్లీ బడ్జెట్ పై నెటిజన్ల సెటైర్లు


కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నెటిజన్లు జోకులు పేల్చారు. లెదర్ ఫుట్ వేర్ పై పన్నును 12 శాతం నుంచి 8 శాతానికి కుదిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. దీనిపై ట్విట్టర్ లో ఓ నెటిజన్, తనదైన శైలిలో కామెంట్ చేశాడు. ‘‘మన రాజకీయ నేతల మీద ఆగ్రహం వస్తే, వారిపై మరింత నాణ్యమైన చెప్పులను విసిరొచ్చు’’ అంటూ అతడు ట్వీట్ చేశాడు. ఇక సిగటరెట్ల ధరలను పెంచేలా జైట్లీ తీసుకున్న నిర్ణయంపై ఓ ధూమపాన ప్రియుడు ‘‘కనీసం మమ్మల్ని చౌకగానైనా చనిపోనివ్వండి’’ అంటూ జోకాడు. ‘‘సిగరెట్ ధరలు పెంచేందుకు ఇంత భారీ కసరత్తు అవసరమా?’’ అంటూ మరో ట్వీటర్ తన నిరసనను వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News