: నిజామాబాదులో భారీ వర్షం... సీఎం కేసీఆర్ పర్యటన రద్దు!


తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు నిజామాబాదు జిల్లాలో జరపనున్న పర్యటన రద్దైంది. నేడు నిజామాబాదు జిల్లా పర్యటనకు వెళ్లనున్న సీఎం కేసీఆర్ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన వెంకటేశ్వర ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. సీఎం పర్యటనకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే నిజామాబాదులో నేటి తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణంలో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. మారిన వాతావరణ పరిస్థితుల్లో హెలికాప్టర్ ప్రయాణానికి ఏయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతి నిరాకరించింది. దీంతో నిజామాబాదు జిల్లా పర్యటనను రద్దు చేసుకోవాలని ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు భద్రతా సిబ్బంది కేసీఆర్ కు సూచించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తన పర్యటనను రద్దు చేసుకన్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News