: రాహుల్ గాంధీ యూరప్ వెళ్లారట... 9న తిరిగి వస్తారట: రాహుల్ సన్నిహితుడి వెల్లడి


సెలవు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెద్ద చర్చకే తెర తీశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏమాత్రం బాధ్యత లేకుండా ఏ విదేశానికో పర్యటనకెళ్లారని రాహుల్ పై బీజేపీ విరుచుకుపడింది. అయితే రాహుల్ గాంధీ సెలవు తీసుకున్న మాట వాస్తవమేనని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ... ఆయన దేశంలోనే ఉన్నారని, విదేశాలకు వెళ్లలేదని ప్రకటించింది. ఉత్తరాఖండ్ లో ఓ ప్రాంతంలో ఆయన సేదదీరుతున్నారని పార్టీ నేత ఒకరు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్ గాంధీ విదేశాలకెళ్లిన మాట నిజమేనని, ఆయన సన్నిహితుడొకరు తాజాగా వ్యాఖ్యానించారు. విపాసన యోగ చేసేందుకే రాహుల్ యూరప్ వెళ్లారని కూడా సదరు నేత పేర్కొన్నారు. యూరప్ నుంచి ఈ నెల 9న రాహుల్ గాంధీ తిరిగి వస్తారని కూడా ఆ నేత చెబుతున్నారు.

  • Loading...

More Telugu News