: విశాఖలోని కొమ్మాదిని చుట్టుముట్టిన పోలీసులు... ఎందుకో తెలుసా?
విశాఖపట్నంలోని కొమ్మాది ప్రాంతాన్ని నేటి తెల్లవారుజామున పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. దాదాపు 400 మంది పోలీసులు చుట్టూ మోహరించడంతో కొమ్మాది వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అసలు ఏం జరిగిందో, పోలీసులు ఎందుకు రౌండప్ చేశారో తెలియక జనం బెంబేలెత్తిపోయారు. తీరా అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రవాదులు, మావోయిస్టులు, సంఘ విద్రోహ శక్తులను నిలువరించే క్రమంలో చేపట్టాల్సిన చర్యలను రిహార్సల్ చేస్తున్న క్రమంలోనే పోలీసులు ఈ ‘ముట్టడి’ కార్యక్రమాన్ని నిర్వహించారట. మాక్ డ్రిల్ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసులతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా పాలుపంచుకున్నారు.