: మాంసం ముద్దలు, రక్తపు మడుగులు... చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం


చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడుపేట రోడ్డులో సీతారాంపేట మలుపు వద్ద ఓ టవేరా వాహనాన్ని కంటెయినర్ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించారు. వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గంగరెడ్డి పాలెం గ్రామానికి చెందిన మామిడి వెంకటేశ్వర్లు కుటుంబం, మరికొందరు బంధువులు మొత్తం 11 మంది టవేరా వాహనంలో తిరుమల బయల్దేరారు. అయితే, సీతారాంపేట మలుపు వద్దకు వచ్చేసరికి శనివారం ఉదయం అయింది. ఆ సమయంలో యూపీ వెళుతున్న ఓ కంటెయినర్ టవేరాను బలంగా ఢీకొట్టింది. దీంతో, ఆ ప్రదేశమంతా మాంసం ముద్దలు, రోడ్డుపై రక్తపు మడుగులతో భీతావహంగా మారిపోయింది. కొన్ని మృతదేహాలు నుజ్జునుజ్జయిన టవేరాలో ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సాయంతో పోలీసులు మృతదేహాలను బయటికి తీశారు. ప్రమాదం జరిగిన సమయం ఉదయం కావడంతో ఇరు వాహనాల డ్రైవర్లూ నిద్రమత్తు కారణంగానే వాహనాలపై అదుపుకోల్పోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News