: బ్రెయిన్ డెడ్ వ్యక్తి గుండెను మహిళకు అమర్చిన యశోదా ఆసుపత్రి వైద్యులు


సికింద్రాబాదు యశోదా ఆసుపత్రిలో అరుదైన, సంక్షిష్టమైన గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. బ్రెయిన్ డెడ్ వ్యక్తి గుండెను ఓ మహిళకు విజయవంతంగా అమర్చారు. బెంగళూరు వ్యక్తి గుండెను ఖమ్మం జిల్లాకు చెందిన పద్మ(46) అనే మహిళకు అమర్చారు. డాక్టర్ గోఖలే ఆధ్వర్యంలోని వైద్య బృందం దాదాపు 7 గంటలపాటు శ్రమించి ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. గుండెమార్పిడి తర్వాత ఆ మహిళను ఐసీయూకు తరలించారు. ఐసీయూలోకి ఆమె కుటుంబ సభ్యులను అనుమతించారు. కాగా, ఆ గుండెను వైద్యులు బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి నుంచి ప్రత్యేక విమానంలో రిట్రైవల్ బాక్సులో ఉంచి తీసుకుని వచ్చారు.

  • Loading...

More Telugu News