: సోనమ్ కపూర్ కు స్వైన్ ఫ్లూ
బాలీవుడ్ అందాలతార సోనమ్ కపూర్ స్వైన్ ఫ్లూ లక్షణాలతో రాజ్ కోట్ లోని స్టెర్లింగ్ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు వైద్య పరీక్షలు జరపగా, స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయింది. సల్మాన్ ఖాన్ చిత్రం 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' షూటింగ్ లో పాల్గొనేందుకు ఆమె రాజ్ కోట్ జిల్లాలోని గోందాల్ పట్టణం వెళ్లారు. అక్కడ ఆమె తీవ్రమైన దగ్గు, జ్వరంతో బాధపడడంతో ఆసుపత్రికి తరలించారు. రక్తనమూనాలను పరీక్షకు పంపగా, ఫలితం పాజిటివ్ గా వచ్చిందని స్టెర్లింగ్ హస్పిటల్ క్రిటికల్ కేర్ యూనిట్ హెడ్ డాక్టర్ చిరాగ్ మాత్రావాడియా తెలిపారు. సోనమ్ కు ముంబయిలో ఈ వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమె ఫిట్ నెస్ ట్రైనర్ కూడా ఇప్పటికే ముంబయిలో స్వైన్ ఫ్లూ చికిత్స పొందుతున్నాడని ఆయన పేర్కొన్నారు.