: రాష్ట్ర విభజనలో మీ పాత్ర ఉంది... ఇప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా?: బీజేపీపై చంద్రబాబు ఫైర్


కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని కోరామని... అయినా పట్టించుకోలేదని అన్నారు. తమకు అన్యాయం చేసినందుకే కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు సమాధి కట్టారని... ఇన్ డైరెక్టుగా బీజేపీకి కూడా వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర పరిస్థితిని ఎనిమిది సార్లు వివరించానని... అయినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఆనాడు రాష్ట్ర విభజన జరిగే సమయంలో, బీజేపీ కూడా సహకరించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాంటప్పుడు, ఇప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా? లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలా భాధపడాలో కూడా అర్థం కావడం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు కేటాయించారని... అవి ఏమూలకు సరిపోతాయో కేంద్ర ప్రభుత్వమే చెప్పాలని అడిగారు. రైతులకు తీరని అన్యాయం జరిగే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News