: బడ్జెట్ లో ఏపీ విషయంలో ఎలాంటి తేడా లేదు: సుజనా చౌదరి


కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయమే జరిగిందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. బడ్జెట్ లో ఏపీ విషయంలో నిన్నటికీ, ఇవ్వాళ్టికీ ఎలాంటి తేడా లేదని చెప్పారు. న్యాయసమ్మతంగా హామీలను నెరవేరుస్తామని చెప్పారని, న్యాయబద్ధం అంటే సభలో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలన్నీ ఉంటాయని పేర్కొన్నారు. తాజా బడ్జెట్ లో హామీల ఊసేలేదన్నారు. దాన్ని బట్టి చూస్తే బడ్జెట్ ఏపీకి అంత ఊతమిచ్చినట్టుగా కనిపించడం లేదన్నారు. అయితే, గత పదేళ్లలో పాడైపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే విధంగా బడ్జెట్ ఉందని ప్రశంసించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు బడ్జెట్ ప్రోత్సాహకరంగా ఉందని, వాణిజ్య, పారిశ్రామికరంగాలకు బడ్జెట్ చాలా బాగుందని సుజనా అన్నారు.

  • Loading...

More Telugu News