: ఇది పేదల వ్యతిరేక బడ్జెట్: సోనియా


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. ఇది కార్పొరేట్ సంస్థలకు అనుకూల బడ్జెట్ అని విమర్శించారు. పేదలకు ఈ బడ్జెట్ తో ప్రయోజనం ఏమీ లేదని అన్నారు. మొత్తమ్మీద బడ్జెట్ నిరాశాజనకంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు శశి థరూర్, కమలనాథ్ కూడా మేడమ్ అభిప్రాయంతో ఏకీభవించారు. బడ్జెట్ పేదల వ్యతిరేకమని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అటు, బడ్జెట్ పై ఏపీ మంత్రులు కూడా పెదవి విరిచారు. బడ్జెట్ లో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడం పట్ల కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు తదితరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుతో సమావేశమై బడ్జెట్ తీరుతెన్నులపై చర్చించారు.

  • Loading...

More Telugu News