: ధావన్ వికెట్ డౌన్... బాదుడు మొదలు పెట్టిన రోహిత్


యూఏఈతో మ్యాచ్ లో 103 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన ధావన్ తేలిగ్గా వికెట్ పారేసుకున్నాడు. అప్పటికి జట్టు స్కోరు 6.3 ఓవర్లలో 29 పరుగులే. అనంతరం కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఈ దశలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ బాదుడుకు తెరదీశాడు. నవీద్ విసిరిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో 3 ఫోర్లు కొట్టి ప్రమాద హెచ్చరికలు జారీచేశాడు. 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు వికెట్ నష్టానికి 52 పరుగులు కాగా, రోహిత్ 27, కోహ్లీ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి 51 పరుగులు చేయాల్సి ఉంది. మరో 40 ఓవర్లు అందుబాటులో ఉన్నాయి.

  • Loading...

More Telugu News