: బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగింది: టీడీపీ ఎంపీ


ఈ రోజు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు పెదవి విరిచారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో కష్టాల్లో ఉన్న ఏపీకి ఈ బడ్జెట్ ద్వారా ఒనగూరింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపై శ్రద్ధ కనబరచకపోవడం బాధ కలిగించిందని చెప్పారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కేంద్రానికి ఇప్పటికే ఎన్నోసార్లు వివరించామని, అయినా బడ్జెట్లో ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశమే లేదని అన్నారు.

  • Loading...

More Telugu News