: ఫాస్ట్ పిచ్ పై అశ్విన్ అదుర్స్... యూఏఈ 102 ఆలౌట్


పెర్త్ లో జరుగుతున్న వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. ఆడుతోంది పసికూన యూఏఈ జట్టుతోనే అయినా, ఉదాసీనతకు తావివ్వకుండా కట్టుదిట్టమైన బౌలింగుతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, ఫాస్ట్ పిచ్ గా పేరున్న పెర్త్ ట్రాక్ పై ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ చెలరేగిపోవడంతో యూఏఈ 31.3 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ 4 వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్, జడేజా చెరో 2 వికెట్లతో రాణించారు. షాయిమాన్ అన్వర్ 35 టాప్ స్కోరర్. ఖుర్రమ్ ఖాన్ 14, గురుగె 10* పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్ కనీసం రెండంకెల స్కోరును కూడా నమోదు చేయలేకపోయారు.

  • Loading...

More Telugu News