: స్పష్టమైన విజన్ తో బడ్జెట్: మోదీ
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంటులో అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ స్పష్టమైన విజన్ తో అభివృద్ధికి సోపానంలా ఉందని ప్రధాని మోదీ ప్రశంసించారు. పన్ను విధానాన్ని జైట్లీ ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని తెలిపిన ఆయన, పెట్టుబడులను మరింతగా ఆకర్షించేలా ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సమ ప్రాధాన్యం ఇచ్చారని, గృహ, విద్య, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాలపై దీర్ఘకాల లక్ష్యాల్ని నిర్దేశించుకోవడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం కల్పించడం, నల్లధనంపై చట్టం తేవాలన్న ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పట్టేవిగా ఉన్నాయని అన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేలా పలు కొత్త పతకాలు రూపొందించడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. మంచి బడ్జెట్ను రూపొందించడంతో జైట్లీ కృతకృత్యులయ్యారని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.