: యూఏఈని ఇబ్బందులు పెడుతున్న బౌలర్లు... 12 ఓవర్లలో 34/3
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ ఆటగాళ్లను భారత బౌలర్లు ఇబ్బందులు పెడుతున్నారు. ముఖ్యంగా ఉమేష్ యాదవ్ తన షార్ట్ కట్టర్స్ తో బ్యాట్స్ మెన్లకు కొరుకుడు పడటం లేదు. దీంతో పరుగులు రాబట్టుకునేందుకు యూఏఈ కష్టపడుతోంది. భువనేశ్వర్ కుమార్ తన మూడో ఓవర్ ఆఖరి బంతికి అంజాద్ అలీని అవుట్ చేయగా, 11వ ఓవర్ 2వ బంతికి అశ్విన్ బౌలింగ్ లో కృష్ణ చంద్రన్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం యూఏఈ స్కోర్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 34 పరుగులు.