: కేంద్ర బడ్జెట్ పూర్తి వివరాలు - పార్ట్ 4


కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లోని ప్రధానాంశాలు. * విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక నిధి * బీహార్, బెంగాల్ మాదిరిగానే ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం * చట్టం ప్రకారమే ఏపీ, తెలంగాణలకు సాయం * గృహ నిర్మాణాలకు రూ. 22,407 కోట్లు * కార్పొరేట్ ట్యాక్స్ 30 నుంచి 25 శాతానికి తగ్గింపు * జల వనరులకు రూ. 4,173 కోట్లు * ఐటీ పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. ఆదాయ పన్ను స్లాబులు యథాతథం. * రూ. 4,40,000 ఆదాయం వరకు పన్ను ప్రయోజనాలు * ఈ సమావేశాల్లోనే నల్లధనంపై బిల్లును తీసుకొస్తాం. * బినామీ ఆస్తులపై కొరడా ఝుళిపిస్తాం * లక్ష దాటిన అన్ని లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి * పన్ను ఎగవేతదారులకు పదేళ్ల జైలు శిక్ష * సంపద పన్ను రద్దు. దాని స్థానంలో సర్ ఛార్జ్ అమలు. వార్షికాదాయం రూ. కోటి దాటితే 2 శాతం సూపర్ రిచ్ పన్ను (సర్ ఛార్జ్). * సాంకేతిక సేవలపై 15 శాతం పన్ను తగ్గింపు. 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు. * రైల్వే, రోడ్డు ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు పన్నురహిత బాండ్లు * పాదరక్షలపై ఎక్సైజ్ పన్ను రద్దు * ఈపీఎఫ్ లోని పింఛను పథకాలను ఎంచుకునే సౌలభ్యం * ఒకే గొడుగు కిందకు ఎఫ్ఎంసీ, సెబీ * నల్లధనం అరికట్టేందుకు డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీల పెంపు * జనధన యోజన ఖాతాదారులకు డెబిట్ కార్డులు * నగదు లావాదేవీలన్నీ కార్డుల ద్వారా జరిగేలా చర్యలు * మనీలాండరింగ్ చట్టాల్లో మార్పులు, సవరణలు తీసుకొస్తాం * ఇతర దేశాల్లో ఆస్తుల వివరాలు వెల్లడించకపోతే, సమానస్థాయి దేశీయ ఆస్తుల జప్తు * హెల్త్ ఇన్స్యూరెన్స్ పై ట్యాక్స్ లిమిట్ రూ. 25 వేలకు పెంపు * రూ. లక్ష దాటిన విదేశీ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి * 80 ఏళ్లు దాటిన వారికి రూ. 30 వేల వరకు మెడికల్ రీయింబర్స్ మెంట్ * పెన్షన్ ఫండ్ లో లక్షన్నర వరకు ట్యాక్స్ మినహాయింపు * 22 వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు * తగ్గనున్న చెప్పులు, బూట్లు, తోలు వస్తువుల ధరలు * పెరగనున్న సిగరెట్లు, పాలిథిన్, పాన్ మసాలాల ధరలు * ట్రాన్స్ పోర్ట్ అలవెన్సు కింద రూ. 1600 వరకు ట్యాక్స్ మినహాయింపు * స్వచ్ఛభారత్ కు అందించే నిధులకు 100శాతం పన్ను మినహాయింపు

  • Loading...

More Telugu News