: ఆస్ట్రేలియాపై అతి కష్టం మీద గెలిచిన న్యూజిలాండ్


ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో న్యూజిలాండ్ అతి కష్టం మీద విజయం సాధించింది. తొలుత ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించగా, న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించి ఆ జట్టు వెన్ను విరిచి కేవలం 151 పరుగులకే పరిమితం చేశారు. తక్కువ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 23.1 ఓవర్లలో లక్ష్యాన్ని అధిగమించింది. న్యూజిలాండ్ జట్టులో గుప్తిల్ 11, మెక్ కల్లమ్ 50, టేలర్ 1, ఇలియట్ 0, విలియమ్సన్ 45 అండర్సన్ 26, రోన్చ్ 6, వెటోరి 0 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 6, కుమిన్స్, మాక్స్ వెల్ చెరో వికెట్ పడగొట్టారు. 5 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించిన న్యూజిలాండ్ బౌలర్ బౌల్ట్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News