: కేంద్ర బడ్జెట్ పూర్తి వివరాలు - పార్ట్ 2
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లోని ప్రధానాంశాలు. * 2016 ఏప్రిల్ 1 నాటికి జీఎస్టీని అమల్లోకి తీసుకొస్తాం. * ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి విలువ బలపడింది. * ఇండియాను తయారీ కేంద్రంగా మారుస్తాం. * ప్రతి 5 కిలోమీటర్లకు ఓ పాఠశాల, ప్రతి 10 కిలోమీటర్లకు ఓ కళాశాల ఏర్పాటు చేస్తాం. * నీటి పారుదల పథకాలను మెరుగుపరిచి, వ్యవసాయాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళతాం. * దేశ ఆర్థిక వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. * ఉన్నత ఆదాయ వర్గాలకు వంటగ్యాస్ రాయితీని నిలిపివేస్తాం. * పార్లమెంటు సభ్యులు కూడా స్వచ్ఛందంగా వంటగ్యాస్ రాయితీని వదులుకోవాలి. * స్టార్టప్ కంపెనీలకు అధిక ప్రోత్సాహం. * బొగ్గుగనుల వేలంతో లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది. * 80 వేల ప్రాథమిక పాఠశాలలను అప్ గ్రేడ్ చేస్తాం. * రాష్ట్రాలకు ప్రాధాన్యతనిస్తూ వస్తు సేవల పన్నులు * కేంద్ర ఆదాయం నుంచి రాష్ట్రాలకు 62 శాతం నిధులను ఇస్తాం. * వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. * ప్రతి గ్రామంలో వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తాం. * రూ. 20 వేల కోట్లతో 'ముద్ర బ్యాంక్'తో సూక్ష్మ రుణాలు. * మరో లక్ష కిలోమీటర్ల రహదారులు నిర్మిస్తాం. * నష్టదాయక కంపెనీలు, ఆదాయం లేని సంస్థల నుంచి పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకుంటాం. * యువతను నైపుణ్యం గల పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం. * సబ్సిడీల దుర్వినియోగాన్ని నిరోధిస్తాం. * హామీ మేరకు ద్రవ్యలోటును 4.1 శాతానికి నియంత్రిస్తాం. * ద్రవ్యలోటును మూడేళ్లలో 3 శాతానికి కట్టడి చేస్తాం. * ద్రవ్యోల్బణం 6 శాతం దాటకుండా చర్యలు తీసుకుంటాం. * చిన్నతరహా నీటిపారుదల ప్రాజెక్టులకు రూ. 5300 కోట్లు. * 2015-16లో రూ. 8.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు. * 'అటల్' పెన్షల్ పథకం అమలు చేస్తాం. * ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు. * 11.45 కోట్ల మందికి ఎల్పీజీ సబ్సిడీ అందించాం. * స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియాకు మరింత ప్రాధాన్యం. * ఎల్పీజీ సబ్సిడీలు, స్కాలర్ షిప్ లు నేరుగా లబ్ధిదారులకే బదిలీ. * మైనార్టీ యువత కోసం 'నయీ మంజిల్' అనే పథకం. మైనార్టీల కోసం సమీకృత విద్యా పథకం. * మౌలిక వసతుల కల్పన కోసం అదనంగా మరో రూ. 70 వేల కోట్లు * సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు. * గ్రామీణ మౌలిక వసతుల కల్పన కోసం రూ. 25 వేల కోట్ల నిధులు. * ఎంఎన్ఆర్ఈజీఏ పథకం కోసం తొలి విడతలో రూ. 34,699 కోట్ల కేటాయింపు * ప్రధాని వ్యవసాయ పథకం మరియు మైక్రో ఇరిగేషన్ కోసం రూ. 5300 కోట్లు * 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుల నిర్మాణం