: భారత్ లో పడిపోయిన యాపిల్ ఐఫోన్ 6, 6 ప్లస్ ధరలు


ఐఫోన్ల రంగంలో దూసుకుపోతున్న యాపిల్ సంస్థ ఐఫోన్ ధరలు భారత్ లో పడిపోయాయి. గతేడాది అక్టోబర్ లో దేశీయ మార్కెట్ లో ప్రవేశపెట్టిన ఐఫోన్ 6, 6 ప్లస్ ఫోన్ల ధరలు ప్రధాన ఇ-కామర్స్ వెబ్ సైట్లలో తగ్గిపోయాయి. మూడవ పార్టీ అమ్మకందారులైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్, ఇతర వెబ్ సైట్లు ఈ కొత్త ఐఫోన్ల రకాలైన 16, 32, 64 జీబీలను రూ.2,000- 5,000ల డిస్కౌంట్ తో అమ్ముతున్నాయి. వాటిలో ఐఫోన్ 6ను మంచి ధరకు ఫ్లిప్ కార్ట్ ఇస్తోంది. ఈ క్రమంలో 16జీ ఐఫోన్ 6 ప్రారంభ ధర రూ.53,500 ఉంటే ఫ్లిప్ కార్ట్ రూ.48,595 డిస్కౌంట్ తో, 64 జీబీ ఐఫోన్ 6 ప్రారంభ ధర రూ.62,500 ఉంటే ఫ్లిప్ కార్ట్ రూ.57,448కి, 128 జీబీ ఐఫోన్ 6 ప్రారంభ ధర రూ.71,500, ఫ్లిప్ కార్ట్ రూ.70,045కే ఫ్లిప్ కార్ట్ విక్రయిస్తోంది. ఇలానే అమెజాన్ కూడా డిస్కౌంట్ తో ఐఫోన్ లను అమ్ముతోంది.

  • Loading...

More Telugu News