: బడ్జెట్ చదవటంలో జైట్లీ ఇబ్బందులు
సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని చదవడంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇబ్బంది పడ్డారు. నడుము నొప్పితో ఆయన బాధపడుతుండగా, దాన్ని గమనించిన స్పీకర్ సుమిత్రా మహాజన్, "మీకు అవసరమని భావిస్తే కూర్చొని ప్రసంగించండి" అని కోరారు. అవసరమైతే కూర్చుంటానని చెబుతూ, స్పీకరుకు కృతఙ్ఞతలు తెలిపిన జైట్లీ, ఆపై ఐదు నిమిషాల తరువాత తన స్థానంలో కూర్చొని ప్రసంగాన్ని కొనసాగించారు. గత సంవత్సరం కూడా జైట్లీ తన బడ్జెట్ ప్రసంగాన్ని కూర్చొని చదివిన సంగతి తెలిసిందే. భారత చరిత్రలో కూర్చొని బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ఏకైక మంత్రి జైట్లీనే.