: బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
ఈ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్రపతి భవన్ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమై, బడ్జెట్ వివరాలను వెల్లడించారు. అనంతరం పార్లమెంటుకు వెళ్లారు. వెంటనే, కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా సాధారణ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే బడ్జెట్ పత్రాలను హై సెక్యూరిటీ మధ్య అధికారులు పార్లమెంటుకు తీసుకువచ్చారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ను చదివిన తర్వాత, ఈ ప్రతులను ఉభయ సభల్లోని సభ్యులకు అందజేస్తారు.