: భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదుల హతం
పాక్ లో శిక్షణ పొంది, భారత్ లో మారణహోమం సృష్టించడానికి ఉగ్రవాదులు నిరంతరం యత్నిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో పాక్ గడ్డ మీద నుంచి అంతర్జాతీయ సరిహద్దును దాటుకుని భారత్ లో చొరబడేందుకు పలుమార్లు ఉగ్రవాదులు యత్నించారు. ఈ సందర్భంగా భారత బలగాలు వారి ప్రయత్నాలను తిప్పికొట్టి, అనేక మందిని చంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, నేడు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వద్ద మన దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను భారత భద్రతాదళాలు కాల్చి చంపాయి. ఈ వివరాలను భారత ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు.