: రాష్ట్రపతితో సమావేశమైన జైట్లీ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. సాధారణ బడ్జెట్ ను ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, రాష్ట్రపతి భవన్ వెళ్లి ప్రణబ్ దాదాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, బడ్జెట్ వివరాలను రాష్ట్రపతికి జైట్లీ వివరించారు. సాధారణంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతిని ఆర్థికమంత్రి కలవడం ఆనవాయతీగా వస్తోంది. రాష్ట్రపతితో భేటీ అనంతరం పార్లమెంటుకు జైట్లీ బయలుదేరారు. మరో అరగంటలో పార్లమెంటులో జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.