: మెక్ కల్లమ్ హాఫ్ సెంచరీ... 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్
వరల్డ్ కప్ లో భాగంగా ఆక్లాండ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో 152 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భోజన విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. ఓపెనర్ మెక్ కల్లమ్ తనదైన శైలిలో రెచ్చిపోయి మరో హాఫ్ సెంచరీ సాధించాడు. 21 బంతుల్లో 3 సిక్సులు, 7 ఫోర్ల సాయంతో 50 పరుగుల మార్కును చేరి అవుట్ అయ్యాడు. అంతకుముందు 40 పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్ రూపంలో గుప్టిల్ (11) ను కోల్పోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోర్ 8.1 ఓవర్లలో 79/3.