: యాసిడ్ దాడి చేస్తాడట... పోలీసులను ఆశ్రయించిన నటి మాలాశ్రీ


ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో వెలిగిన నటి మాలాశ్రీ తనపై యాసిడ్ దాడి జరగవచ్చని భయపడుతోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా పోలీసులకు తెలిపింది. తాను విధుల్లో ఉంచిన ఉద్యోగి తనను బెదిరిస్తున్నాడని ఆమె వాపోయింది. గత కొన్ని సంవత్సరాల నుంచి భర్త రాముతో కలసి బెంగళూరులో నివసిస్తున్న ఆమె పేరిట చెన్నైలో ఒక మాల్, అపార్ట్‌ మెంట్ ఉన్నాయి. వాటి నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఓ ఉద్యోగిని నియమించుకుంది. ఇటీవల అపార్ట్‌ మెంట్‌ విక్రయించేందుకు సిద్ధంకాగా, వచ్చే డబ్బులో వాటా ఇవ్వాలని, లేదంటే యాసిడ్ దాడి చేస్తానంటూ ఆ ఉద్యోగి ఫోన్‌ లో బెదిరిస్తున్నాడని తెలిపింది. అతని వెంట మరో ఇద్దరు కూడా ఉన్నారని ఆమె తన ఫిర్యాదులో వెల్లడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News