: సంక్షేమమా?... సంస్కరణలా?... మరికాసేపట్లో పార్లమెంట్ ముందుకు బడ్జెట్


కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మరికాసేపట్లో 2015-16 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ ను పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నారు. ఈ బడ్జెట్ పై అన్నివర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పన్ను మినహాయింపులు పెంచడం ద్వారా ప్రజల్లో పొదుపు చర్యలను ప్రోత్సహించేలా కొన్ని నిర్ణయాలను జైట్లీ ప్రతిపాదించవచ్చని అంచనా. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగుల ఆదాయపు పన్ను రాయితీల పరిమితి పెంపు, వడ్డీ రేట్లు, బంగారం, ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతిపై సుంకాల తగ్గింపు వంటివి ఉంటాయని ఆశతో ఉన్నారు. మోదీ నేతృత్వంలో రెండోసారి బడ్జెట్‌ ను ప్రవేశపెడుతున్న అరుణ్‌ జైట్లీ సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తారా? లేక సంస్కరణల బాటన నడుస్తారా? అన్న విషయం నేటి మధ్యాహ్నానికి తేలనుంది.

  • Loading...

More Telugu News