: చీరాల ఎంపీపీకి ఐదేళ్ల జైలుశిక్ష


ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలో దోషిగా నిర్ధారిస్తూ, ప్రకాశం జిల్లా చీరాల ఎంపీపీ గవిని శ్రీనివాసులుకు ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ చీరాల సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి ఎన్‌.శాంతి తీర్పిచ్చారు. గత ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ రోజున జరిగిన అల్లర్లలో పలువురిపై ఈపురుపాలెం పోలీస్ స్టేషనులో సెక్షన్‌ 307 కింద కేసు నమోదు కాగా, దీనికి సంబంధించి ఎంపీపీ శ్రీనివాసరావు సహా మొత్తం 12 మందికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ తీర్పుపై అప్పీలు చేయనున్నట్టు శ్రీనివాసరావు తెలిపారు.

  • Loading...

More Telugu News