: తడబడ్డ ఆస్ట్రేలియా... 100 పరుగుల లోపే 6 వికెట్లు ఫట్!


న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌ మెన్ తడబడ్డారు. 100 పరుగులు కూడా చేయకుండానే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 97 పరుగులకు 6 ప్రధాన వికెట్లు కోల్పోయింది. 23 పరుగులు చేసిన వాట్సన్ ను వెటోరి బోల్తా కొట్టించగా, ఫామ్‌లో ఉన్న వార్నర్ 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సౌథీ బౌలింగులో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అంతకుముందు ఆరోన్ ఫించ్ 14 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టగా, స్మిత్ ను వెటోరీ; మాక్స్ వెల్, మార్ష్ లను బౌల్ట్ తన రెండు అద్భుత బంతులతో బౌల్డ్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా అభిమానులు తీవ్ర నిరాశలో మునిగారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 18 ఓవర్లకు 97/6.

  • Loading...

More Telugu News