: తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రమే... కేసీఆర్


విడిపోతే తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని తాను ఎప్పుడో చెప్పినట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. 14వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా గుర్తించినందున ఇక అభివృద్ధి కోసం రుణ పరిమితిని పెంచాలని డిమాండ్ చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం మరో మిగులు నిధుల రాష్ట్రం గుజరాత్ సాయం తీసుకోనున్నట్టు కేసీఆర్ వివరించారు. 2018 నాటికి తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందని అంచనా వేశారు. డబ్బున్న రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజీలు రావని, లోటు బడ్జెట్‌ లో ఉన్న 11 రాష్ట్రాలను ఆదుకోవడం ధర్మమని అన్న ఆయన మరింత అభివృద్ధి కోసం నిధులిచ్చి ప్రోత్సహించాలని మోడీ, జైట్లీలను కోరినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News