: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం


చిత్తూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ, కారు ఢీకొనగా ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన చవర్లేట్ వాహనంలో మొత్తం 11 మంది ప్రయాణిస్తుండగా, మిగిలినవారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. వీరు గుంటూరు జిల్లాకు చెందినవారని తెలిసింది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News