: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా


ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం అయింది. మొత్తం పోటీలకు ఆతిథ్యమిస్తున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికాసేపట్లో ఆట మొదలుకానుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లూ బలంగా ఉండడం, ఇప్పటివరకూ ఓటమిని ఎరుగక పోవడంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. కాగా, న్యూజిలాండ్ 3 వరుస మ్యాచ్ లలో గెలిచి పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో ఉండగా, ఆసీస్ ఒక మ్యాచ్ రద్దు కారణంగా రెండో స్థానంలో కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News