: లగ్జరీ క్రూయిజ్ లో గడ్కరీ షికారు... మరో వివాదంలో బీజేపీ నేత
కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎస్సార్ కంపెనీకి చెందిన లగ్జరీ క్రూయిజ్ లో రెండు రాత్రులు ఎంజాయ్ చేశారని వార్తలు వెలువడ్డాయి. దీనిపై కాంగ్రెస్ తదితర విపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ నిర్వహిస్తున్న ఎన్జీఓ సీపీఐఎల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ మొత్తం ఘటనపై గడ్కరీ వివరణ ఇచ్చారు. తన జీవితంలో ఏ ఒక్క కార్పొరేట్ కంపెనీ నుంచీ డబ్బు తీసుకోలేదన్నారు. పర్యటన నాటికి తాను మంత్రిని, ఎంపీని కానని తెలిపిన ఆయన, ఖర్చులన్నీ స్వయంగా పెట్టుకున్నట్టు తెలిపారు.