: యాంకర్ ను కడిగేసిన టీడీపీ మహిళా మంత్రి


తన ప్రసంగాన్ని త్వరగా ముగించాలని స్లిప్ పంపించిన యాంకర్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి కిమిడి మృణాళిని తీవ్రంగా కోప్పడ్డారు. సుదీర్ఘ ప్రసంగాన్ని ముగించాలని గన్‌ మన్ ద్వారా స్లిప్పు పంపించిన యాంకర్ ను, ఆ స్లిప్ తెచ్చి ఇచ్చిన గన్‌ మన్ ను ఆమె కడిగేశారు. ఈ ఘటన విజయనగరంలోని అయోధ్య మైదానంలో చంద్రన్న సంక్షేమ అవగాహన సభలో జరగగా, ఇప్పుడది టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి ప్రసంగిస్తుండగా ఆ కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్న మహిళ ఇక ముగించాలంటూ స్లిప్పు పంపించారు. దీంతో అసహనానికి లోనైన మృణాళిని చిర్రెత్తిపోయారు. 'నీ స్థాయి తెలుసుకుని ప్రవర్తించా'లంటూ గన్‌ మన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత యాంకర్‌ కి కోటింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా సభ నిర్వాహకులైన సాంఘిక సంక్షేమ శాఖ డీడీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీపై కూడా ఆమె మండిపడ్డారు. అసలీ యాంకర్లను పెట్టమన్నదెవరని నిలదీశారు.

  • Loading...

More Telugu News