: భారత్-పాక్ సంబంధాల్లో నాటకీయ పరిణామాలు సంభవించవు: విదేశాంగ శాఖ
భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎన్.జయశంకర్ సార్క్ యాత్రకు వెళ్లనున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ దానిపై స్పందించింది. జయశంకర్ వెళుతున్నది సార్క్ యాత్రకే కానీ పాకిస్థాన్ పర్యటనకు కాదని స్పష్టం చేసింది. దీని వల్ల పాక్-భారత్ సంబంధాల్లో నాటకీయ పరిణామాలు ఏమీ చోటుచేసుకోబోవని స్పష్టం చేసింది. మీడియా అంశానికి అధిక ప్రాధాన్యమిస్తుండడంతో తామీ స్పష్టతనివ్వాల్సి వచ్చిందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మార్చి 1న భూటాన్ పర్యటనతో ప్రారంభమయ్యే జయశంకర్ 'సార్క్' యాత్ర మార్చి 3న పాకిస్థాన్ కు చేరుకుంటుంది. దీనిపై మీడియా ప్రత్యేక కథనాలు ప్రసారం చేయడంతో విదేశాంగ శాఖ ఈ ప్రకటన జారీ చేసింది.