: దేశం మొత్తం ఒకలా... జమ్మూకాశ్మీర్ లో మరోలా!
శివరాత్రి నుంచి దేశంలో వాతావరణం వేడెక్కడం ప్రారంభించింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను కూడా భానుడు వేడెక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, వేసవిలో సూర్యుడి ప్రతాపం ఎలా ఉంటుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. దీనికి విరుద్ధంగా, జమ్మూకాశ్మీర్లో మరోసారి భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. అక్కడ వర్షం కురవడంతో పాటు హిమపాతం కురుస్తోంది. దీంతో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు చేరుకుంది. ఆదివారం వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయని ఆక్కడి వాతావరణ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో గుల్మార్గ్, పశ్చిమ కాశ్మీర్ లో మైనస్ 9 డిగ్రీలు నమోదు కాగా, పహల్గామ్ లో మైనస్ 1.7 డిగ్రీలు, శ్రీనగర్ లో 0.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.