: చంద్రబాబు పాలనలోనే గద్దర్ వెన్నులో బుల్లెట్ దిగింది: టీఆర్ఎస్
తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని... వారంతా నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు. మిషన్ కాకతీయను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన గొప్ప పథకం ఇది అని చెప్పారు. సమసమాజం కోసం పాటుపడుతున్న మావోయిస్టులను పిట్టల్లా కాల్చి చంపించిన ఘనత టీడీపీ నేత చంద్రబాబుదని విమర్శించారు. బాబు పాలనలోనే గద్దర్ వెన్నులో బుల్లెట్ దిగిందని గుర్తు చేశారు.