: యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలకు 'ఎంఎన్ఆర్ఈజీఏ' ఓ స్మారక చిహ్నం... మేము దాన్ని ఆపబోం: మోదీ
యూపీఏ ప్రభుత్వం హాయంలో ప్రవేశపెట్టిన ప్రధాన పథకం మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ ('ఎంఎన్ఆర్ఈజీఏ')ను ఎన్డీఏ ప్రభుత్వం ఆపదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఎందుకంటే అది మునుపటి ప్రభుత్వ వైఫల్యాలకు ప్రత్యక్ష సాక్ష్యమని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ధన్యవాద ప్రసంగం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, "నాకు మంచి రాజకీయ పరిజ్ఞానం ఉంది. ఎంఎన్ఆర్ఈజీఏను ఆపొద్దని అది చెబుతోంది. ఎందుకంటే ఈ కార్యక్రమం గత ప్రభుత్వ విఫలతకు నిదర్శనమని నా ఆలోచనా విధానం అంటోంది. ఎంఎన్ఆర్ఈజీఏ ఇకపై కూడా ఉంటుంది. దానికి అంతంలేదు. అందుకే ఎలాంటి తప్పు చేయను. అయితే దానికి కొంత విలువ చేర్చడం వల్ల పేదలకు లాభం కలుగుతుంది" అని వ్యంగంగా మాట్లాడారు.