: 86 మంది భారత మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నేవీ


దాదాపు 86 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్టు చేసింది. వారితో పాటు 10 బోటులను కూడా అదుపులోకి తీసుకున్నామని నేవీ అధికారులు తెలిపారు. అక్రమంగా తమ దేశ జలాల్లో ప్రవేశించినందుకే ముల్లైతీవు తూర్పు తీరంలో జాలర్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. శ్రీలంకలో కొత్త ప్రభుత్వం వచ్చాక భారత మత్స్యకారులు తమ దేశ జలాల్లో అక్రమంగా ప్రవేశించడం పెరిగిందని లంక జాలర్లు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మార్చి 5న ఇరు దేశాలు చర్చించనున్నట్టు లంక అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News