: ముందు రైతులను రుణవిముక్తులను చేయండి: ములాయం
ప్రధాని నరేంద్ర మోదీ సుధీర్ఘోపన్యాసంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రైతులను అప్పుల ఊబి నుంచి బయట పడేయాలని సూచించారు. దేశంలో రైతులు చాలా సమస్యలతో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రైతులను రుణవిముక్తలను చేసిన తరువాత భూసేకరణ గురించి మాట్లాడితే బాగుంటుందని ఆయన సూచించారు. రైతులకు న్యాయం చేయకుండా, వారి సమస్యలు తీర్చకుండా, వారి నుంచి భూములు ఎలా సేకరిస్తారని ఆయన ప్రశ్నించారు. అప్పుల ఊబి నుంచి బయటపడేంత వరకు రైతులకు విముక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, భూసేకరణ చేయని కారణంగానే ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని ప్రధాని పేర్కొన్నారు. దీనిపై అన్ని పక్షాలు అందోళన చేస్తున్నాయి. భూసేకరణ వల్ల రైతులు ఎలా లబ్ధి పొందుతారో చెప్పాలని ప్రధానిని నిలదీస్తున్నాయి.