: వైసీపీ వల్లే రాజధాని ప్రాంత రైతులకు పరిహారం పెరిగింది: ఎమ్మెల్యే ఆళ్ల


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆందోళనలు, డిమాండ్ వల్లే నవ్యాంధ్ర రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులకు పరిహారం పెరిగిందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. లేకుంటే రైతులకు తక్కువ పరిహారం ముట్టజెప్పి మోసం చేసేవారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద 25వేల ఎకరాలను సేకరించిందని, అటు సర్కారు భూములు 15వేల ఎకరాలున్నాయని, ఈ మొత్తం రాజధాని నిర్మాణానికి సరిపోతుంది కదా అని అడిగారు. అలాంటప్పుడు ఇంకా భూసేకరణ ఎందుకని ఎమ్మెల్యే ఆళ్ల ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News