: బిజినెస్‌ ఉన్నంత వరకే సేవ!


యాహూ మెయిల్‌ లాంటి సంస్థలు మనకు అప్పనంగా చాలా సేవలు అందించేస్తున్నాయని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. మనం వాడే మెయిల్‌ సర్వీసు వలన వారికి మరింత మెండుగా లాభాలు ఉండబట్టే.. వారు ఆ మాత్రం సేవలను అందిస్తున్నారు. లాభాలు కొంచెం తగ్గుముఖంగా కనిపిస్తుండే సరికి.. ఇప్పుడు ఏకంగా మెయిల్‌ సేవలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేయాలని అనుకుంటున్నారు. ఇలా లాభం చేకూర్చని దేశాల్లో మెయిల్‌ సేవలను వదిలించుకోవడానికి యాహూ ఇప్పుడు ప్రయత్నిస్తోంది. తమాషా ఏంటంటే.. జనాభాలో నెంబర్‌ వన్‌ లో ఉండే చైనాలో యాహూకు ఆదరణ లేకపోవడం, అక్కడ మెయిల్‌ సేవల వ్యాపారం లాభసాటిగా లేదని వారు డిసైడవ్వడం.

ఇక్కడ నెటిజన్లనుంచి సరైన ప్రోత్సాహం లేక ఆగస్టు 19 నుంచి ఈమెయిల్‌ సేవల్ని నిలిపేయాలని భావిస్తున్నట్లు యాహూ ప్రకటించింది. ఆ తర్వాత కేవలం వెబ్‌సైట్‌మాత్రమే ఆ దేశంలో ఉంటుంది. చైనాలో యాహూ మెయిల్‌ వాడే వాళ్లు.. ఆ దేశంలో దీనిని నిర్వహిస్తున్న ఆలీక్లౌడ్‌ పోర్టల్‌కు మారాలని యాహూ ఓ సూచన చేసింది కూడా. 2005 నుంచి యాహూను చైనాలో నిర్వహిస్తున్న సంస్థ ఆలీబాబా ప్రతినిధి జాంగ్‌ జియాన్హువా.. యాహూ మూసివేత ప్రభావం చాలా ఉంటుందని అంటున్నారు.

  • Loading...

More Telugu News