: అత్యంత చెత్త రికార్డు... క్రికెట్ లో బెర్ముడాతో సమానంగా నిలిచిన వెస్టిండీస్!

సిడ్నీలో ప్రపంచ కప్ క్రికెట్ పోటీల సందర్భంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అత్యధిక పరుగుల తేడాతో ఓడిన జట్టుగా వెస్టిండీస్ జట్టు ఇప్పటికే ఉన్న 'చెత్త రికార్డు'ను సమం చేసింది. ఈ మ్యాచ్ లో 257 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. గతంలో ఈ రికార్డు బెర్ముడాపై ఉండేది. 2007 వరల్డ్ కప్ లో ఆ దేశంపై ఇండియా 257 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజాగా, అంతే తేడాతో ఓడిపోయిన విండీస్ ఈ 'చెత్త రికార్డు'తో బెర్ముడా సరసన నిలిచింది.