: సినిమాల్లో ఆ తిట్ల నిషేధం సబబే: జీవిత
తెలుగు సినిమాల్లో 30 పదాలను నిషేధించడం సబబేనని కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలు జీవిత అభిప్రాయపడ్డారు. ఒక జాతీయ దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఈ తిట్లు లేకుంటేనే మంచిదని అన్నారు. నాయాలా, దొంగ నాయాలా, ముష్టి నాయాలా, చిల్లర నాయాలా, వీపీ, నీ అమ్మ, చెత్త నా కొడకా, గాడిద కొడకా, బొక్క, బొంగు వంటి పదాలపై నిషేధం సరైనదేనని వివరించారు. ఇటీవల ఈ పదాలను సినిమాల్లో వినియోగించడాన్ని నిషేధించగా, నిర్మాతలు అభ్యంతరం పెట్టిన సంగతి తెలిసిందే. విద్యావంతులు దైనందిన జీవితంలో ఈ పదాలను వినియోగించరని, నిర్మాతలు ఎందుకు వివాదం రేపుతున్నారో తెలియడంలేదని ఆమె అన్నారు.