: తీహార్ జైల్లో ఉన్నప్పుడు క్రికెటర్ శ్రీశాంత్ పై హత్యాయత్నం జరిగిందట!


ఐపీఎల్ స్పాట్-ఫిక్సింగ్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న క్రికెటర్ శ్రీశాంత్ అరెస్టయి మే, 2013లో కొన్ని రోజులు తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో అతనిని చంపే ప్రయత్నం జరిగిందని శ్రీ బావమరిది, గాయకుడైన మధు బాలకృష్ణన్ వెల్లడించారు. ఓ టీవీ టాక్ షోలో పాల్గొన్న అతను మాట్లాడుతూ, "ఓ హత్య కేసులో నిందితుడైన ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో శ్రీని చంపేందుకు ప్రయత్నించాడు, అయితే ఎలాగో తను తప్పించుకున్నాడు. తరువాత పోలీసులు వచ్చి కాపాడారు. కానీ ఆ ఘటన ఐపీఎల్ స్కామ్ కు సంబంధించే జరిగిందని చెప్పలేము. జైల్లో ఉన్నప్పుడు శ్రీ చాలా హింసకు గురయ్యాడు. మరోవైపు భారత జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు శ్రీపై పగ పెట్టుకున్నారు" అని అతను వివరించాడు.

  • Loading...

More Telugu News